హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • దత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్
  • మంటల ధాటికి రోడ్డు మీద పడిన పగిలిన అద్దాలు
  • మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలి రోడ్డు మీద పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని దుకాణాలను ఖాళీ చేయించిన పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Fire Accident
Hyderabad
Telangana

More Telugu News